విజయవాడలో దారుణం వెలుగు చూసింది. గుణదల బీఆర్టీఎస్ రోడ్డు సమీపంలోని పొదల్లో ఏడు రోజుల పసికందును సంచిలో ఉంచి వదిలివెళ్లారు. బాలుడి ఏడుపు విని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మాచవరం పోలీసులు చిన్నారిని చైల్డ్‌లైన్ నిర్వహకులకు అప్పగించారు. బాలుడి సమాచారం తెలిస్తే చైల్డ్‌లైన్ నిర్వహకులకు లేదా 1098 నెంబర్‌కు సమాచారమివ్వాలని సూచించారు.
ఇదీ చదవండి: