అమరావతి పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాజధాని రైతులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల ఆందోళనలకు మద్దతుగా... కృష్ణా జిల్లాలో ప్రజలు ధర్నాలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ తీరును నిరసించారు. ''రక్షించండి రక్షించండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి, జై అమరావతి, వన్ స్టేట్ వన్ క్యాపిటల్, 3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు'' అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి