రాష్ట్రంలోని గృహనిర్మాణ ప్రాజెక్టుల కోసం... బలవంతపు భూసేకరణ చేయబోమని... మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దశలవారీగా అందరికీ ఇస్తామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విలువ కేంద్ర, రాష్ట్రా వాటాలు కలిపి రూ.7042 కోట్లు అని మంత్రి వివరించారు.
రానున్న ఐదేళ్లలో మొత్తం రూ.50 వేల కోట్లు గృహనిర్మాణం కోసం ఖర్చు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. 7.8 లక్షల మంది స్థలాలు కలిగిన లబ్ధిదారులు, 18.5 లక్షల మంది భూమిలేని లబ్ధిదారులను గుర్తించామన్నారు. పారదర్శకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా... గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని వివరించారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో... హౌసింగ్ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
ఇదీ చూడండి