ETV Bharat / state

'విశాఖనే రాజధానిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే..!'

author img

By

Published : Jan 7, 2020, 7:22 PM IST

Updated : Jan 8, 2020, 5:35 AM IST

రాజధానిపై జీఎన్​రావు, బీసీజీ కమిటీల ప్రతినిధులు తాము రూపొందించిన నివేదికల సారాంశాన్ని హైపవర్​ కమిటీ ముందుంచారు. విశాఖను ఎందుకు రాజధానిగా ఎంచుకున్నారన్న మంత్రుల ప్రశ్నకు కమిటీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి అమరావతి నిర్మాణ ఖర్చును ప్రభుత్వం భరించలేదన్న విషయం తమ అధ్యయనంలో వెల్లడైందని వివరించారు. అయితే దీనిపై మరో 2, 3 భేటీల తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని హైపవర్​ కమిటీ భావిస్తోంది.

'విశాఖనే రాజధానిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే..!'
'విశాఖనే రాజధానిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే..!'

జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం కోసం తొలిసారి భేటీ అయిన హైపవర్‌ కమిటీ... పాలన వికేంద్రీకరణపైనే ప్రధానంగా చర్చించింది. ఆర్ధిక మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగిన సమావేశానికి... ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, హోం మంత్రి సుచరిత, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, పేర్ని నాని, గౌతమ్‌రెడ్డి, కొడాలి నాని హాజరయ్యారు. సుమారు 4 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం సాగింది. 3రాజధానులను ప్రతిపాదిస్తూ తామిచ్చిన నివేదికలోని అంశాలను జీఎన్‌రావు స్వయంగా కమిటీకి వివరించారు. విశాఖ నగరాన్నే రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారని మంత్రులు... ప్రతినిధులను ప్రశ్నించారు. గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ భరించలేదనే విషయం తమ అధ్యయనంలో వెల్లడైందన్న ప్రతినిధులు... ఆ మొత్తాన్ని పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు సహా ఇతర అభివృద్ధి పథకాలపై ఖర్చు చేయాలని సూచించారు. వాటి వల్ల ఫలితం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో జీడీపీ వృద్ధి ఉన్న టాప్-10 నగరాల జాబితాలో విశాఖ పదో స్థానంలో ఉందని ప్రతినిధులు వెల్లడించారు. 209 బిలియన్‌ యూఎస్ డాలర్లతో ముంబయి తొలి స్థానంలో ఉండగా... 26 బిలియన్‌ యూఎస్ డాలర్లతో విశాఖ పదో స్థానంలో ఉందని వివరించారు.

పాలన వికేంద్రీకరణతో పాటు ప్రతి జిల్లాలోనూ కీలక ప్రాజెక్టులు.... చేపట్టాల్సిన అభివృద్ది పనులపై తాము దృష్టి సారించినట్లు కమిటీ తెలిపింది. అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించింది. రైతులు ఉద్ధృతంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో... వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడింది. రెండు-మూడు ఆప్షన్లను రాజధాని రైతుల ముందుంచాలని కమిటీ సూచించింది.

కమిటీల నివేదికపై ముగిసిన హైపవర్​ కమిటీ సమావేశం

అభివృద్ధితో పాటు పాలన కూడా వికేంద్రీకరణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపిన మంత్రులు... జోనల్, సెక్టార్ల వారీగా అభివృద్ధిపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. రాజధాని ఆందోళనలను రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేసిన అమాత్యులు... అన్నదాతల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. మరో మూడు రోజుల్లో హైపవర్‌ కమిటీ మళ్లీ సమావేశమవుతుందని ఈనెల 20లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు

ఇదీ చూడండి:

'పథకాల అమలులో బ్యాంకుల సహకారం మరువలేనిది'

Intro:Body:Conclusion:
Last Updated : Jan 8, 2020, 5:35 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.