రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వాదనల సందర్భంగా... ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని..... పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు దిశగా....... అడుగులు వేస్తున్నారని వాదించారు. తరలింపును ఆపేందుకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఐతే...రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు, హైకోర్టు అంశాలపై శాసనమండలిలో చర్చ జరుగుతోందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను.. హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలుపై విచారణ...... ఫిబ్రవరి 3కు వాయిదా పడింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు
వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది
రాజధాని తరలింపుపై రైతుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది అశోక్ భాను వాదనలు వినిపించారు. ప్రజల ఆకాంక్షలను అణచివేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రైతుల న్యాయబద్ధమైన ఆకాంక్షలకు విఘాతం కలిగించేలా బిల్లు ఉందన్నారు. సమాజహితానికి భంగకరమైన విధానాలు అడ్డుకునే అధికారం కోర్టుకు ఉందని వాదించారు.
ఇవీ చదవండి