ETV Bharat / state

'పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 2020, మార్చి 31 నాటికి పూర్తి'

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికలు నిర్వహించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉన్నత న్యాయస్థానంలో ప్రమాణ పత్రం దాఖలు చేశారు. ఈ ప్రక్రియను నిర్ణీత తేదీల్లో పూర్తి చేస్తామని ధర్మాసనానికి నివేదించారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పురోగతిని పరిశీలించేందుకు తదుపరి విచారణను.. 2020, జనవరి 3కు వాయిదా వేసింది.

'పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 2020, మార్చి 31 నాటికి పూర్తి'
author img

By

Published : Nov 22, 2019, 4:13 AM IST

'పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 2020, మార్చి 31 నాటికి పూర్తి'
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 2020, మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం, రిజర్వేషన్లకు సంబంధించిన వివరాల్ని 2020 జనవరి 10న రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ముందుంచుతామని పేర్కొంది. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పురోగతిని పరిశీలించేందుకు తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.

60 రోజుల వరకూ వేచి చూడొద్దు

రాష్ట్రంలోని 12,775 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది తాండవ యోగేష్, ఏవీ గోపాలకృష్ణమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు కట్టుబడి ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. 2020 జనవరి మొదటి వారంలో వార్డులు , సర్పంచ్ సీట్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేశాక 45 రోజుల నుంచి 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్​ తరఫున న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు గరిష్ఠంగా 60 రోజుల వరకూ వేచి చూడకుండా.. ముందుగానే పూర్తి చేయాలని సూచించింది.

సీఎస్​ వివరణ

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గతేడాదిలో హైకోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై వివరణ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, షెడ్యూల్ వివరాల్ని అందులో పొందుపరిచారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ 2019 మే 20న పూర్తయిందన్నారు. ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు 2019 జూన్ 18కి పూర్తయినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

నిర్ణీత తేదీల్లో పూర్తి చేస్తాం

ఎన్నికలు నిష్పాక్షికంగా జరిపేందుకు పరిపాలనా యంత్రాంగాన్ని బదిలీ, పునఃస్థాపన 2020 ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేస్తామని సీఎస్​ కోర్టుకు తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామకం, గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు 2020 ఫిబ్రవరి 15 నాటికి పూర్తవుతుందని అన్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది శిక్షణ, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ పెట్టెల సిద్ధం చేసుకోవడం, శాంతి భద్రతల సంరక్షణ కోసం భద్రతా సిబ్బంది నియామకం, రవాణా సదుపాయాల ఏర్పాట్లు 2020 ఫిబ్రవరి 22న పూర్తి చేస్తామని సీఎస్​ ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

సమస్యల వలయంలో... మన్యం పాఠశాలలు..!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.