ETV Bharat / state

మొక్కలు నాటండి.. వాతావరణాన్ని కాపాడండి: గవర్నర్ - Governor Plantation news in telugu

కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద ఎత్తున మెుక్కలు నాటాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ పిలుపునిచ్చారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గవర్నర్​ రాజ్ భవన్ ప్రాంగణంలో ఉసిరి, తులసి మొక్కలు నాటారు.

governor-plantation-at-raj-bhavan
author img

By

Published : Nov 6, 2019, 9:54 AM IST

రాజ్​ భవన్ ప్రాంగణంలో మెుక్కలు నాటిన గవర్నర్​

వేగంగా మారుతున్న వాతావరణ పరిస్ధితులను మెరుగుపరిచి, కాలుష్యాన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ పిలుపునిచ్చారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉసిరి, తులసి మొక్కలు నాటారు. ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలు భారతదేశానికి ప్రాముఖ్యమైనవని, వాటిని వాతావరణ మార్పుల వల్ల అంతరించి పోకుండా కాపాడాలని కోరారు. వ్యక్తిగతంగా తనకు మొక్కల పెంపకం పట్ల మంచి ఆసక్తి ఉందని, ఏ కార్యక్రమానికి వెళ్లినా తాను మొక్కలు నాటేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని గవర్నర్​ తెలిపారు. పచ్చదనం పెంపునకు దోహద పడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారని, ప్రజలు స్పందించి మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జున రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

మహాత్ముడు నాటిన మొక్క... ఏలూరుకు నీడ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.