మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు గానీ... సీబీఐకి గానీ అప్పగించాలని మృతుడి భార్య సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశంపై ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలనూ.. వాటితో కలపి విచారించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ వెంకరమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: వివేకా హత్య కేసు శనివారం విచారణకు వచ్చే అవకాశం..!