రెండు నెలలుగా కృష్ణానదిలో వేట కోసం ఆ 2 గ్రామాల ప్రజలు మధ్య గొడవ జరిగింది. ఆ ఘర్షణలో కొంతమంది ఉపాధి కోల్పోయారు... మరికొందరు ఊరే విడిచి వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై 'ఈటీవీ భారత్'లో కథనం ప్రచురితమైంది. ఆ ఊర్ల కథ సూఖాంతమైంది. మంగళవారం అవనిగడ్డ ఎస్సై బి.బి రవికుమార్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి. సురేశ్... రెండు గ్రామాల ప్రజల మధ్య రాజీ కుదిర్చారు. ఈ గ్రామాల ప్రజలతో ఒప్పంద పత్రం రాయించారు.
రెండు గ్రామాల పెద్దలు హద్దులు నిర్ణయించుకోమని ఒప్పంద పత్రంలో రాయించారు. గొడవలు పడినా చర్యలు తీసుకొవచ్చని సంతకాలు తీసుకున్నారు. కృష్ణానదిలో ఫైబర్ బోటు, ఇంజను బోట్లు, నిషేధిత వలలతో వేటాడబోమని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన నియమ నిబంధనలు వివరించామని... 2 గ్రామాల పెద్దలు, ప్రజలు అంగీకారించారని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి...
చేపా... చేపా... ఎంత పని చేశావ్... పల్లెల మధ్య చిచ్చు పెట్టేశావ్...