కృష్ణా నదిలో చేపల వేట కోసం రెండు గ్రామాల మధ్య పంచాయితీ తేలడం లేదు. ఆ నదిలో వేట తమదంటే తమదంటూ ఈలచెట్ల దిబ్బ, నాచుగుంట గ్రామస్థులు తగువులాడుకుంటున్నారు.
ఈల చెట్ల దిబ్బ గ్రామంలో మొత్తం 450 కుటుంబాలు, 1500 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ 90 శాతం మందికి జీవనాధారం వేటే. గత రెండు నెలలుగా కృష్ణా నదిలో వేట విషయంలో నాచుగుంట గ్రామస్థులు వివాదం నెలకొంది.
నాచుగుంట గ్రామస్థులు కర్రలకు వలకట్టు కట్టి.. తమవైపు చేపలు రాకుండా చేస్తున్నారని ఈలచెట్ల దిబ్బవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. వేట హక్కు తమకే ఉందని వేరెవరూ వేటాడినా ఊరుకునేది లేదని నాచుగుంటవాసుల బెదిరింపులతో ఈలచెట్ల దిబ్బ ప్రజలు ఉపాధి కోల్పోయారు. పని దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు వలస వెళ్లిపోతున్నారు.
నాగాయలంక పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సమస్య తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈలచెట్లదిబ్బవాసులు. తమకు వేట తప్ప మరో ఆదాయమార్గం లేదని వాపోతున్నారు. 65 బోట్లకు వేట లైసెన్స్ ఉందని రాయితీపై వలలు అందజేశారని చెబుతున్నారు. 2 గ్రామాల ప్రజలతో చర్చలు జరిపి అందరికీ అనుకూలంగా సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: