ETV Bharat / state

గూడవల్లిలో ఏడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - eenadu sports league news in gudavalli

ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు గూడవల్లి డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏడో రోజు ఉత్సాహభరితంగా కొనసాగాయి. మొత్తం 4 మ్యాచ్​లలో జూనియర్స్ విభాగంలో రెండు జట్లు, సీనియర్స్ విభాగంలో రెండు జట్లు హోరాహోరిగా తలపడ్డాయి.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/22-December-2019/5459232_cricket.mp4
గూడవల్లిలో ఏడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్
author img

By

Published : Dec 22, 2019, 10:51 PM IST

మెుదటి మ్యాచ్​లో లయోలా జూనియర్ కళాశాల-గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్​లో లయోలా జూనియర్‌ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్​లో ఎస్​ఏవీ అండ్ ఎన్​వీ జూనియర్​ కళాశాల-ఉషారామా పాలిటెక్నిక్ కళాశాల జట్లు హోరాహోరిగా పోటీపడగా... ఉషా రామా పాలిటెక్నిక్ కళాశాల జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్ సీనియర్స్ విభాగంలో సన్ ఫ్లవర్ ఇంజినీరింగ్ కళాశాల-శ్రీవిద్యా డిగ్రీ కళాశాల జట్లు పోటిపడగా శ్రీవిద్య డిగ్రీ కళాశాల విజయకేతనం ఎగరేసింది. నాలుగో మ్యాచ్​ సీనియర్స్ విభాగంలో ఆంధ్రా లయోలా కళాశాల- మండవ ఇంజినీరింగ్ కళాశాల జట్లు పోటాపోటీగా తలపడగా ఆంధ్రా లయోలా కళాశాల విజయం సాధించింది.

ఇదీ చూడండి: ఉత్కంఠగా 'గూడవల్లి డీజేఆర్​' లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.