ETV Bharat / state

ఆదుకున్న ఆపరేషన్ ముస్కాన్.. 3636 చిన్నారులు గుర్తింపు - ఆపరేషన్ ముస్కాన్ న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఆపరేషన్ ముస్కాన్​లో ఇప్పటి వరకూ 3636 మంది చిన్నారులను గుర్తించారు. పోలీసు, శిశు సంక్షేమ శాఖలతో పాటు పలు విభాగాల సమన్వయంతో తప్పిపోయిన, బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి వారి సమాచారాన్ని ఛైల్డ్ ట్రాక్​ పోర్టల్​లో నమోదు చేశారు.

dgp-comments-on-operation-muskan
ఆదుకున్న ఆపరేషన్ ముస్కాన్
author img

By

Published : Jan 5, 2020, 7:23 AM IST

రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రుల వద్దకు చేర్పించడం, అనాథలకు పునరావాసం కల్పించేందుకై పోలీసుశాఖ రెండు రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్​ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో పోలీసుశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, క్రీడా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు తనిఖీలు నిర్వహించాయి. రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, రాష్టంలో ఉన్న బాలబాలికల వివరాలను సేకరించి వారి ఫొటోలతో ఆల్బమ్ రూపొందిస్తారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్​లు, జ‌న‌సామ‌ర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను తనిఖీ చేస్తారు.

చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు

ఇందులో భాగంగా ప్రతీ సబ్​డివిజన్​లో ఒక ఎస్సై, నలుగురు పోలీసు కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతీ బృందంలో మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ బృందాలు సాధారణ దుస్తుల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల్లో గుర్తించిన పిల్లల సమాచారాన్ని ఛైల్డ్ ట్రాక్ పోర్టల్​లో ఉంచుతారు. ఆపరేషన్ ముస్కాన్​లో గుర్తించిన చిన్నారులను 24 గంటలలోపు ఆయా జిల్లాల్లోని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు అప్పగిస్తారు. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీల ద్వారా దొరికిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. సరైన చిరునామా దొరకని పిల్లలను షెల్టర్ హోంలలో ఉంచుతారు. రెండు రోజుల పాటు నిర్వహించే... ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో సంబంధిత‌ విభాగాలైన షెల్టర్ హోమ్​లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, డి.సి.ఆర్.బి, ఛైల్డ్ హెల్ప్ లైన్, ఛైల్డ్ వెల్ఫేర్‌ అధికారులు, జువెనైల్ జస్టిస్ బోర్డ్, ఐ.సి.డి.ఎస్, ఛైల్డ్ వెల్ఫేర్‌ కమిటీలు పాల్గొనటంతో పాటు తమ దగ్గర ఉన్న‌ సమాచారాన్ని అందరికీ అందించి పిల్లలను గుర్తించేందుకు కృషిచేస్తారు.

పోర్టల్​లో వివరాలు నమోదు

ఈ రెండు రోజులు ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గుర్తించిన పిల్లల వివరాలను ట్రాక్ ఛైల్డ్ పోర్ట‌ల్‌లో పొందుప‌రుస్తారు. దొరికిన పిల్లల్లో ఎవరైనా వ్యసనాలకు గురైతే వారిని డీఅడిక్షన్ కేంద్రాలకు పంపిస్తారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలలో బాలకార్మికులు దొరికినట్లైతే ఆయా యజమానులపై బాలకార్మిక నిషేధ చట్టం, వెట్టిచాకిరి నిరోధక చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేస్తారు. ఈ పిల్లల్లో ఎవరైనా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వారు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టీ చట్టాలు అనుసరించి కేసులు నమోదు చేస్తారు. ఈ ఆపరేషన్ మొత్తం డీ‌జీ‌పీ ఆధ్వర్యంలో నడిచే స్పెషల్ జువెనైల్ పోలీసు యూనిట్లు పర్యవేక్షణలో ఉంటుంది.

గత ఏడాదిలో నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్​లో 5739 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. శనివారం జరిపిన స్పెషల్ డ్రైవ్​లో 3636 మంది బాలబాలికలు గుర్తించారు. వీరిలో బాలురు 3039 మంది, 597 బాలికలు ఉన్నారు.

ఇదీ చదవండి :

'మహిళల భద్రత.. సంరక్షణ కార్యదర్శుల బాధ్యత'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.