పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో మంత్రి అనిల్‌కుమార్ సమాధానం చెప్పాలని... మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జలవనరులశాఖలో చెల్లింపులు ఏయే ఏజెన్సీలకు ఇచ్చారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. పోలవరం పునాదులే లేవలేదని ఆరోపించిన రాష్ట్ర ప్రభుత్వం... రూ.11,500 కోట్ల పనులు ఎలా అయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఖర్చు చేసిన రూ.5,500కోట్ల ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు. దీనిపై ప్రశ్నిస్తుంటే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పోలవరంపై మంత్రి అవగాహన పెంచుకోవాలి' - పోలవరంపై మాట్లాడిన దేవినేని ఉమ
పోలవరం ప్రాజెక్ట్ పనులపై తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మంత్రి అనిల్ కుమార్ పోలవరంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.