ETV Bharat / state

'సామాన్యులనూ ఆర్టీసీలో ప్రయాణించనివ్వండి'

పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ... మైలవరం బస్టాండ్​ వద్ద తెదేపా కార్యకర్తలతో కలిసి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళన చేశారు.  ఛార్జీలు తగ్గించి సామాన్యులను సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

devineni uma reacts on increasing of rtc charges in mylavaram
ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ మైలవరంలో దేవినేని ఉమా ఆందోళన
author img

By

Published : Dec 11, 2019, 2:15 PM IST

ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ మైలవరంలో దేవినేని ఉమా ఆందోళన

అనాలోచితంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారంటూ... ప్రభుత్వ వైఖరిని మాజీమంత్రి, తెదేపా నేత ఉమామహేశ్వరరావు తప్పుబట్టారు. కృష్ణాజిల్లా మైలవరం బస్టాండ్​ వద్ద తెదేపా కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గొల్లపూడి నుంచి మైలవరం వరకు మెట్రో 350రూట్ బస్సులో ప్రయాణించి... సాధారణ ఛార్జీ కంటే 5 రూపాయలు ఎక్కువ పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అదనపు ఛార్జీ పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు పెనుభారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.

చుక్కలు పెట్టే ప్రభుత్వం
సాధారణంగా ఓటు వేసినప్పుడు చుక్కలు పెడతారు. కానీ జగన్​ ప్రభుత్వం కిలో ఉల్లిపాయలకే చుక్కలు పెడుతుందని... ఈ సర్కారు వేలుకి చుక్కలు పెట్టే ప్రభుత్వమని తెదేపా నేత ఉమా ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: ఉల్లి విక్రయ కేంద్రాలను పెంచాలి :తెదేపా నేతలు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.