25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
ప్లాస్టిక్ ఇంజినీరింగ్‌లో శిక్షణ పొందినవారికి మంచి అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందన్న సీఎం జగన్... కేంద్ర సాయం ద్వారా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సీపెట్ కీలకపాత్ర పోషిస్తుందని కేంద్రమంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో యువత ప్రధాన పాత్ర పోషిస్తోందన్న కేంద్రమంత్రి... సీపెట్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని వివరించారు. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైందని... ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా కలుషితం కాకుండా చూడాలన్నారు. విజయవాడలో పరిశ్రమలకు మంచి అవకాశం ఉందని వివరించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో సీపెట్ ఏర్పాటుకు సదానందగౌడ హామీఇచ్చారు.
ఇవి కూడా చదవండి: