ETV Bharat / state

'అధైర్యపడకండి... పోరాడి సాధించుకుందాం'

అధైర్యపడకండి... పోరాడి సాధించుకుందాం అంటూ... వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. రాజధానికి భూములిచ్చి నష్టపోయిన రైతులకు సంఘీభావంగా అన్నదాతలంతా ఒకటి కావాలని సూచించారు. రోడ్డెక్కిన రాజధాని మహిళలకు మద్దతుగా మహిళలంతా ఒకటిగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

chandrababu meet athmakuru women farmers at vijayawada
ఆత్మకూరు రైతులతో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు
author img

By

Published : Jan 29, 2020, 12:05 AM IST

'అధైర్యపడకండి... పోరాడి సాధించుకుందాం'

రాజధాని ప్రాంత ప్రజలెవరూ అధైర్యపడొద్దని... ఆవేదనతో చనిపోరాదని... వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఈసారి తామెన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, గతంలో అనేక సమావేశాలు జరిగినా.. ఎప్పుడూ ఇన్ని దౌర్జన్యాలు జరగలేదని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు, పాములపాడు, మోతడక, నిడుముక్కల, దామరపల్లి బడేపురం, తాడికొండ మహిళలు రాజధాని సమస్యపై చంద్రబాబు వద్ద వాపోయారు.

మంగళగిరి మండలం ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్‌లో... చంద్రబాబును కలిసి రాజధాని ప్రాంత ప్రజలు తమ కష్టాలు వివరించారు. తమ భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుందని భావించామని... ఇప్పుడంతా అంధకారం అయ్యిందని విద్యార్థినిలు వాపోయారు. ఇళ్లలో ఉండే ఆడపిల్లలు రోడ్డెక్కే దుస్థితి కల్పించారని... భూమి ఇచ్చిన రైతులు అవమానాల పాలయ్యారని చంద్రబాబు ఆవేదన చెందారు. ఇలా మహిళలు, రైతులు కన్నీళ్లు పెట్టడం 40 ఏళ్లలో తానెప్పుడూ చూడలేదన్నారు. 84 ఏళ్ల వృద్ధుడైన ప్రసాద్.. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు.

తన స్వార్థం కోసం జోలెపట్టలేదని... ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం జోలె పట్టానన్నారు. తాను అనుకున్న అభివృద్ధి జరిగివుంటే.. విశాఖ నగరం హైదరాబాద్ స్థాయికి వచ్చేదన్నారు. అమరావతిని కాపాడితేనే రాష్ట్రాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు. రాజధానికి భూములిచ్చి నష్టపోయిన రైతులకు సంఘీభావంగా అందరూ ఒక్కటి కావాలన్నారు. రోడ్డెక్కిన రాజధాని మహిళలకు మద్దతుగా మహిళలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

చివరికి బడుల్లోనూ రౌడీ వసూళ్లేనా?: చంద్రబాబు

AP_VJA_11_29_Farmers_Meet_Babu_ab_3038097 Reporter:V.SrinivasaMohan Camera:B.Nagaraju Centre:Aatmakuru, Guntur Dist Anchor:::-రాజధాని ప్రాంత ప్రజలెవరూ అధైర్యపడొద్దని- ఆవేదనతో చనిపోరాదని- పోరాడి సాధించుకుందామని తనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హితవుపలికారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఈ సారి తామెన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, గతంలో అనేక సమావేశాలు జరిగినా ఇప్పుడు జరిగినన్ని దౌర్జన్యాలు జరిగాయని గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు, పాములపాడు, మోతడక, నిడుముక్కల, దామరపల్లి బడేపురం, తాడికొండ మహిళలు వాపోయారు. మంగళగిరి మండలం ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్‌లో ... చంద్రబాబును కలిసి తమ కష్టాలు వివరించారు. మా భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుందని, ఆనందంగా ఉంటామని భావించామని, ఇప్పుడంతా అంధకారం అయ్యిందని విద్యార్ధినులు వాపోయారు. ఇళ్లలో ఉండే ఆడపిల్లలు రోడ్డెక్కే దుస్థితి కల్పించారని... భూమి ఇచ్చిన రైతులు అవమానాల పాలయ్యారని చంద్రబాబు ఆవేదన చెందారు. ఇలా మహిళలు, రైతులు కన్నీళ్లు పెట్టడం 40 ఏళ్లలో తానెప్పుడూ చూడలేదన్నారు. 84 ఏళ్ల వృద్దుడైన ప్రసాద్ చికాగో నుంచి వచ్చి అమరావతి కోసం యజ్ఞాలు చేస్తున్నారని, అమెరికా, ఆస్ట్రేలియా,కువైట్, లండన్, ఐర్లాండ్ తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. తన స్వార్ధం కోసం జోలెపట్టలేదని... ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జోలె పట్టానన్నారు.. తెలుగుదేశం పార్టీకి ఏనాడూ తాను నోరు తెరిచి విరాళాలు అడగలేదని.... అమరావతిని కాపాడటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి జోలె పట్టానని చంద్రబాబు వివరించారు. తాను అనుకున్న అభివృద్ది జరిగివుంటే ఈ రోజు విశాఖ నగరం హైదరాబాద్ స్థాయికి వచ్చేదని... నాలెడ్జ్ ఎకానమీగా, ఆర్ధికరాజధానిగా విశాఖను చేసేందుకు ప్రయత్నించామన్నారు. వచ్చిన కంపెనీలను విశాఖ నుంచి తరిమేశారని... అమరావతిని కాపాడితేనే రాష్ట్రాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు. రాజధానికి భూములిచ్చి నష్టపోయిన రైతులకు సంఘీభావంగా రైతులంతా ఒకటి కావాలని... రోడ్డెక్కిన రాజధాని మహిళలకు మద్దతుగా మహిళలంతా ఒకటిగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.....Vis+byte Byte...చంద్రబాబునాయుడు, తెదేపా అధినేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.