నేరం రూపం మార్చుకుంటుంది తప్ప తగ్గట్లేదు. నిర్భయ లాంటి చట్టాలున్నా.... మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో నేరుగా వచ్చి వేధించారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారు. పోలీసులకు సవాల్‌గా మారుతోన్న సైబర్ నేరాలను... కట్టడి చేసేందుకు కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయటం కన్నా..... నేరం జరగకుండా జాగ్రత్తపడాలని భావిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు 'సైబర్ మిత్ర 'ను రంగంలోకి దించుతామని పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు తెలిపారు.
2 వేల మంది సైబర్ సైనికుల తయారికీ కసరత్తు
విజయవాడ నగర పరిధిలో మొత్తం 2 వేల మంది సైబర్ సైనికులను తయారు చేసేందుకు..పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్క కాలేజీ నుంచి 15 నుంచి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి...సైబర్ నేరాలు జరిగే తీరు గురించి కంప్యూటర్‌పై శిక్షణనిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి... విద్యార్థుల్లో ఆన్‌లైన్ ద్వారా జరిగే నేరాల తీరుపై చైతన్యం కలిగిస్తామని సీపీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఏర్పాటుచేసిన సైబర్ మిత్రకు అనుసంధానంగా వీళ్లు పనిచేస్తారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే... వెంటనే 9121 211 100 నెంబర్‌కు వాట్సప్ చేస్తే చాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మిత్ర రాకతో... సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులకు కళ్లెం వేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
బీ సేఫ్ పేరుతో గోడప్రతులు
మరోవైపు గోడ ప్రతుల ద్వారా అవగాహన పెంచేందుకు... బీ సేఫ్ పేరుతో గోడప్రతులు విడుదల చేయనున్నారు. వీటిని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇవి ఆగ్యుమెంటెడ్ వర్చువల్ రియాలిటీ పరిజ్ఞానం కలిగి ఉంటాయని...... చరవాణితో స్కాన్ చేస్తే లఘుచిత్రాలు కనపడే విధంగా తయారు చేశామని సీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.
ఇదీ చదవండీ: