విజయవాడ ఇంద్రకీలాద్రి గాజుల మహోత్సవానికి ముస్తాబవుతోంది. ఏటా దుర్గమ్మను, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2016 నుంచి ప్రారంభించిన ఈ వేడుకను..తొలి ఏడాది కేవలం 5 లక్షల గాజులతో ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది కోటి గాజుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందాయి.
ఇదీ చదవండి: రేపు ఇంద్రకీలాద్రిలో గాజుల ఉత్సవం...