అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల నిరసన 16వ రోజుకు చేరింది. ఇవాళ మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు చేపట్టనుండగా వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో 16వ రోజూ రైతులు రిలే నిరాహారదీక్షను కొనసాగించనున్నారు. రాజధాని పరిధిలోని ఇతర గ్రామాల్లోనూ నిరసనలు చేపట్టనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు నేటి నుంచి ప్రకాశం జిల్లాలోనూ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు చేపట్టనున్నాయి.
ఇదీ చదవండి :
అమరావతి కోసం.. ప్రాణాలైనా అర్పిస్తాం: బొండా ఉమా