అమరావతి బాలోత్సవ్‌లో... చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే పిల్లల పండుగకు..... విజయవాడ కొత్త పేటలోని పొట్టి శ్రీరాములు, చలవాది మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వేదికైంది. 3 రోజులపాటు జరిగే బాలోత్సవ్‌ను.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 60 అంశాలపై నిర్వహించిన పోటీల్లో....... వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు... సత్తా చాటారు.
వివిధ వేషధారణల్లో చిన్నారులు
భరతమాత, రుద్రమదేవి, భగత్ సింగ్, అల్లూరి సీతామరామరాజు లాంటి ప్రముఖుల వేషధారణల్లో పిల్లలు మురిపించారు. సేవ్ గర్ల్ ఛైల్డ్, ప్లాస్టిక్, కాలుష్యం నివారణ, తల్లిదండ్రుల పట్ల బాధ్యత లాంటి సామాజిక అంశాలపైనా సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి... ఆలోచింపజేశారు. సోలార్ విద్యుదుత్పత్తి లాంటి ప్రాజెక్టులతో విజ్ఞానాన్ని చాటారు.
పలు అంశాల్లో పోటీలు
జానపదాలు, వక్తృత్వం, వ్యాసాలు, కథలు, కవితా రచనలు, ఏకపాత్రాభినయం, మూకాభినయం లాంటి అంశాలతో అమరావతి బాలోత్సవ్ ఇవాళా, రేపు కొనసాగనుంది.
ఇవీ చదవండి