కృష్ణాజిల్లా అవనిగడ్డలో క్రిస్మస్ సందర్భంగా 35 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో స్టార్‌ను ఏర్పాటు చేశారు. దీనిని 35 ట్యూబ్లైట్స్, 73 చిన్న స్టార్లతో తయారు చేశారు. ప్రతి యేటా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ సభ్యుడు కె. అనిల్ కుమార్ తెలిపారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద స్టార్ అని వివరించారు. ఆర్సీఎమ్ చర్చికి క్రైస్తవులతో పాటు హిందు, ముస్లింలు పూజలు చేయటం ప్రత్యేకత అని తెలిపారు. చాలామంది హిందువులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసనలు చేస్తారన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా ముందుగానే పెద్ద స్టార్ ఏర్పాటు వలన దివిసీమ ప్రజల్లో పండుగ వాతవరణం కనిపించిదన్నారు.
ఇవీ చదవండి