కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ 216 జాతీయ రహదారిపై పులిగడ్డ టోల్గేట్ వద్ద పోలీసులు.... వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుండి చెన్నైకు తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ మొత్తం సుమారు 30 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులు ఇద్దరు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. ఇదే జాతీయ రహదారిపై గత సంవత్సరంలో 620 కేజీల గంజాయి పట్టుకుని ఒక బొలెరో వాహనం, రెండు కార్లు సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
ఇవీ చదవండి