వైకాపా ఎంపీలు భాజపాలోకి వెళ్లడంలేదని... మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి స్పష్టం చేశారు. వైకాపా ఎంపీలు పార్టీ మారుతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకుని... ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో పార్టీ మారిన కర్నూలు, అరకు ఎంపీలు తిరిగి వైకాపా గూటికే చేరిన విషయం గుర్తుచేశారు.
ఇదీ చదవండి : 'మంత్రులకు... సభాపతి తోడయ్యారు'