ETV Bharat / state

ఇన్​సైడర్ రగడ : 4 వేల ఎకరాలు ఎలా కొన్నారని వైకాపా ప్రశ్న - ఇన్​సైడర్ ట్రైడింగ్​పై అంబటి కామెంట్స్

తెదేపా ప్రభుత్వ  హయాంలో రాజధానిలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని తొలినుంచీ ఆరోపిస్తోన్న వైకాపా.. మరోసారి పునరుద్ఘాటించింది. ఇన్​సైడర్ ట్రేడింగ్ పేరిట చంద్రబాబు సహా ఆయన బినామీలు వేల ఎకరాల భూములు  చౌకగా కొని రైతులను నిలువునా ముంచారని ఆక్షేపించింది. దీనికి సంబంధించి వివరాలతో  వీడియో ప్రజెంటేషన్​ను ప్రదర్శించింది.  అక్రమాలపై  విచారణ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపిన వైకాపా నేతలు... చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అమరావతిలో నిజమైన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు.

Ambati rambabu
అంబటి రాంబాబు
author img

By

Published : Jan 3, 2020, 6:10 AM IST

మీడియాతో మాట్లాడుతున్న వైకాపా నేతలు

చంద్రబాబు సహా తెదేపా నేతలు అమరావతిలో 4 వేల ఎకరాలకు పైగా భూములు సొంతం చేసుకున్నారంటూ వైకాపా ఆరోపించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి, రైతులను మోసం చేశారంటూ వైకాపా నేతలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో 21 నిమిషాల వీడియో ప్రదర్శించారు. తెదేపా నేతలు నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్, పరిటాల శ్రీరాం, యనమల అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్, కోడెల కుమారుడు, ప్రత్తిపాటి పుల్లారావు సహా అనేక మంది రాజధాని ప్రకటనకు ముందే చౌకగా భూములు కొన్నారని వీడియోలో చూపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉండి అమరావతిలో భూములు కొన్న 60 మంది తెదేపా బినామీలేనని పేర్కొన్నారు. ఇపుడు చంద్రబాబు సకుటుంబ సమేతంగా అమరావతి చేరుకొని మంటలు రేపుతున్నారని ఆరోపించారు.

వైకాపా నేతలు ప్రదర్శించిన వీడియోలు

భూములు తిరిగిస్తామని అప్పుడే చెప్పాం

రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం లేదని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యేలు అన్నారు. బినామీలు, వ్యాపారులు , రియల్ ఎస్టేట్స్​లు కాకుండా నిజమైన రైతులకు ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందన్నారు. బోస్టన్ కమిటీ నివేదిక వచ్చాక చర్చించి రైతులకు న్యాయం చేస్తారని తెలిపారు. అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇస్తామని వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే చెప్పారని గుర్తుచేశారు. రాజధాని ఇక్కడే ఉంచుతామని ఎన్నికల ముందు జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు.

రైతులకు న్యాయం చేస్తాం

రాజధానులపై మేనిఫెస్టోలో పెట్టక పోయినా ప్రయోజనకరమైన అంశం కాబట్టి అమలు చేస్తున్నామని అంబటి వ్యాఖ్యానించారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం పలు రకాల ప్రతిపాదనలు ఆలోచిస్తుందన్నారు.

ఇదీ చదవండి :

చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి: అంబటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.