గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళలు కాగడాలు, కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... గ్రామస్థులు నినాదాలు చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనతో తమ జీవితాల్లో చీకట్లు వ్యాపించాయని.... తమకు వెలుగులు కావాలంటూ ప్రదర్శన నిర్వహించారు. రైతులు, కూలీలతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ... జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: తుళ్లూరులో ఏడో రోజూ కొనసాగుతున్న మహాధర్నా