గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో 12 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గతంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో తన దృష్టికి తెచ్చారని ఆమె తెలిపారు. దాతల సహకారంతో పాటు తన కార్యాలయం నుంచి కూడా నిధులు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ఎన్నారైలు సహాయం చేశారని.. మరింతగా గ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని అన్నారు. నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి
జూనియర్ అథ్లెటిక్స్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ క్రీడాకారులు