ETV Bharat / state

'దాడి యత్నాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం' - వైసీపీపై టీడీపీ పంచ్​లు

తెదేపా అధినేత చంద్రబాబుపై జరిగిన దాడి గురించి ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. డీజీపీపై న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు.

tdp leaders comments about attack on chandra babu
వైకాపాపై తెదేపా నేతల మండిపాటు
author img

By

Published : Nov 29, 2019, 4:17 PM IST

వైకాపాపై తెదేపా నేతల మండిపాటు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై జరిగిన దాడి యత్నాన్ని... కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెదేపా శాసనసభా పక్షం ప్రకటించింది. పార్లమెంట్‌లోనూ ఈ దుశ్చర్యను లెవనెత్తే అవకాశాలు పరిశీలిస్తున్నామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి, డీజీపీ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ప్రకటనతో ప్రజలంతా విస్మయం చెందారన్నారు. డీజీపీ వ్యవహారంపై న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు.

పోలీసులే దగ్గరుండి వైకాపా రౌడీలతో దాడి చేయించారని ఆరోపించారు. జెడ్​ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి పర్యటిస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు చంద్రబాబు పర్యటనకు బ్రహ్మరథం పట్టారన్నారు. వైకాపా తప్పుడు పనుల్లో డీజీపీ సవాంగ్‌ భాగస్వామి అయ్యారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడిని సమర్థిస్తూ... డీజీపీ, మంత్రులు ప్రకటనలు చేయడం హేయమని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి

రేషన్​ కార్డు ఉంటే సంక్రాంతికి రూ.వెయ్యి, చీర ఫ్రీ!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.