ETV Bharat / state

మిర్చి రైతుకు అండగా.. ఇంజినీరింగ్​ విద్యార్థుల పరికరాలు..!

రైతుల కష్టాలు చూసి ఆ విద్యార్థులు చలించిపోయారు. రైతుల కోసం ఏమైనా చేయాలనుకున్నారు. తమ ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అంతా కలిసి రైతులకు ఉపయోగపడే పనిముట్లు, సాంకేతికతను రూపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారు చేసిన ప్రయత్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మిర్చి రైతుల కోసం గుంటూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన పరికరాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

students-made-machines-for-formers-in-guntur

author img

By

Published : Dec 17, 2019, 7:52 PM IST

రైతుల కోసం పరికరాలు రూపొందించిన విద్యార్థులు

గుంటూరు జిల్లా మిరప పంటకు ప్రసిద్ధి. అంతర్జాతీయంగా.. ఇక్కడ పండించే మిర్చికి గిరాకీ ఎక్కువ. ఇక్కడి మార్కెట్ నుంచి 30 దేశాలకు పైగా మిరప ఎగుమతులు జరుగుతుంటాయి. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి రైతులు మిరప పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే మిరపసాగు, కోతలు, ఆరబెట్టడంలో అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. కోతలు కోసే సమయంలో కూలీల చేతులు మంట పుట్టడం... కోత తర్వాత మిర్చిని ఆరబెట్టడం.. ఆ సమయంలో వర్షం నుంచి పంటను రక్షించుకోవటం వంటి సమస్యలు రైతులకు ఇబ్బందిగా మారాయి. వీటన్నింటికి పరిష్కారంగా ఏదైనా చేయాలని గుంటూరు జిల్లా వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఆలోచించారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి..

ఒక్కొక్కరు కాకుండా 12 మంది విద్యార్థులు కలిసి తమ తమ ఆలోచనల్ని పంచుకున్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి రైతులు, కూలీలతో మాట్లాడారు. వారు ఎదుర్కొనే ఇబ్బందులు... ఏం చేస్తే వాటికి పరిష్కారం లభిస్తుందనేదానిపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత వారికి ఉపయోగపడేలా రెండు పరికరాల్ని రూపొందించారు. మిర్చిని సులువుగా కోసేందుకు ప్రత్యేకంగా కోత యంత్రం, అలాగే పంటను ఆరబెట్టే సమయంలో వర్షం నుంచి కాపాడేందుకు మరో పరికరాన్ని తయారు చేశారు. తమ కుటుంబాల్లో అమ్మనాన్న పడే కష్టాలు చూసి రైతు బిడ్డలుగా ఈ పరికరాల తయారీకి ముందుకు వచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు. మిరపకోత యంత్రం తయారీకి 10వేల రూపాయలు ఖర్చయింది. మొక్కకు వేలాడే కాయల్ని చేతులతో ముట్టుకోకుండా రైతులు కోసుకోవచ్చు. అలాగే కోసిన కాయల సేకరించేందుకు దానికే ఓ సంచి అమర్చారు. 5 నుంచి 10 కిలోల మిర్చిని ఇలా సేకరించవచ్చు.

పంటకు కవర్ల రక్షణ

మిర్చి ఆరబెట్టిన సమయంలో రక్షణగా కవర్లు కప్పే పరికరాన్ని విద్యార్థులు ఆవిష్కరించారు. మిరపకాయల కళ్లం చుట్టూ రక్షణ కవర్ అమర్చుతారు. మబ్బులు పట్టి వర్షం వచ్చే సూచనలు కనిపిస్తే చాలు అక్కడి సెన్సార్లు వెంటనే స్పందిస్తాయి. వెంటనే మోటార్ల సాయంతో రక్షణ కవర్ మిర్చి పంటపైన కప్పుకుపోతుంది. అలాగే కవర్ కప్పిన విషయం వెంటనే రైతు చరవాణికి సంక్షిప్త సందేశం ద్వారా చేరుతుంది. ఈ పరికరం ద్వారా రైతులు హడావుడిగా కళ్లానికి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. అలాగే పరికరం పనిచేస్తుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది.

జాతీయ స్థాయిలో గుర్తింపు

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత స్థాయి ప్రదర్శనల్లో ఈ రెండు పరికరాలు మొదటి స్థానం సంపాదించాయి. ఈ రెండు పరికరాలపై తదుపరి పరిశోధనలు, క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం ఏఐసీటీఈతో పాటు మరికొన్ని ప్రైవేటు కంపెనీలు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చాయి. పరికరాలు తయారీ సమయంలో ఎన్నో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల సహకారంతో వాటిని అధిగమించారు. ఇంటి వద్ద కుంటుబ సభ్యులు పడే కష్టంతో పాటు కళాశాలకు వచ్చే సమయంలో పొలాల్లో రైతుల అవస్థలు చూసి విద్యార్థులను పరికరాలు రూపొందించే దిశగా పురిగొల్పింది. సాధారణంగా ప్రాజెక్టుల్లో భాగంగా విద్యార్థులు ఏదో ఒక పరికరం తయారు చేయాల్సి ఉంటుంది. కానీ వీరు తయారు చేసిన ఈ నవీన ఆవిష్కరణలు రైతులకు ఉపయోగపడడం విశేషం.

ఇవీ చదవండి:

మళ్లీ పెరిగిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతో తెలుసా?

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.