ETV Bharat / state

మా ఎమ్మెల్యే ముద్దొచ్చింది... బుగ్గలు నిమిరిన బుడతడు..!

author img

By

Published : Nov 26, 2019, 6:28 AM IST

Updated : Nov 26, 2019, 10:12 AM IST

ప్రజాప్రతినిధులు పాఠశాల సందర్శనకు విచ్చేసినప్పుడు పిల్లలు సాధారణంగా కరచాలనం చేసి సంతోషిస్తారు. కానీ ఓ విద్యార్థి ఏకంగా ఎమ్మెల్యే బుగ్గలు నిమిరి తెగ సంబరపడిపోయాడు. ఆ చిలిపి పనికి కోపం తెచ్చుకుందామనుకున్నా.. చిన్నపిల్లాడే కదా అని ఆ ఎమ్మెల్యే నవ్వేశారు. ఈ వింత అనుభవం చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినికి ఎదురైంది.

STUDENT TOUCH MLACHEEKS IN CHILAKALURIPETA OF GUNTUR
చిలకలూరిపేట ఎమ్మెల్యే బుగ్గలు నిమిరిన ఓ విద్యార్థి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినికి వింత అనుభవం ఎదురైంది. నవంబర్14న బాలల దినోత్సవం సందర్భంగా... కావూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్​ను ఆమె సందర్శించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి ఎమ్మెల్యే బుగ్గలు నిమరటంతో ఆమె ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఏదో అనాలని అనుకున్న ఆమె... చిన్నపిల్లాడి చర్యగా భావించి నవ్వుతూ ముందుకెళ్లారు. వాస్తవానికి ఆ కుర్రాడు ఎమ్మెల్యేకు కరచాలనం చేయాలని భావించాడు. కానీ అది కుదరదని అనుకున్నాడో ఏమో... ఉన్నట్లుండి బుగ్గలు నిమరటంతో అందరూ ఆశ్చర్యపోయారు. బుడ‌త‌డు మాత్రం సంబ‌రంలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆగదు: హోంమంత్రి

sample description
Last Updated : Nov 26, 2019, 10:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.