ETV Bharat / state

పాముకాటుకు గురై ప్రభుత్వాసుపత్రికి వస్తే... స్పందించని వైద్యులు

author img

By

Published : Oct 28, 2019, 10:09 AM IST

పాముకాటుకు గురై ఓ మహిళ గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చింది. ఎంతసేపు చూసినా వైద్యులు రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. వైద్యులు లేరని తేల్చడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ggh
పాముకాటుకు గురై ఆస్పత్రికి వస్తే...స్పందించని వైద్యులు

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవల తీరుపై స్థానికులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా కొండవీడుకు చెందిన సత్యవాణి... పాముకాటుకు గురై ఆస్పత్రికి వచ్చింది. 3 గంటలు వేచి చూసినా వైద్యులు రాలేదు... చికిత్సా చేయలేదు. గత్యంతరం లేక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాము కాటుకు గురైన ఆమెకు మొదట బంధువులు ఫిరంగిపురంలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించిందని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఎంతకీ వైద్యులు రాకపోయేసరికి కుటుంబసభ్యులు...వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు సర్ది చెప్పగా...ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

వంతెన నీటిపాలు... ప్రజల కష్టాలు చూడు..!

Intro:Ap_gnt_02_28_ggh_doctors_nirlakshyam_av_3067949
Reporter: p.suryarao

( ) గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవల తీరుపై మరోసారి ఆరోపణలు గుప్పుమన్నాయి. పాము కాటుతో వచ్చిన మహిళ... మూడు గంటలపాటు వేచి చూసినా వైద్యులు లేక... విధిలేని పరిస్థితిలో ప్రవేట్ ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా కొండవీడు గ్రామానికి చెందిన సత్యవాణి అనే మహిళకు ఈ పరిస్థితి ఎదురైంది. పొలంలో పాము కాటుతో బంధువులు ఆమెను తొలుత ఫిరంగిపురంలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో గుంటూరు లోని జీజీహెచ్ కు తరలించారు. మూడు గంటలపాటు వైద్యం కోసం ఎదురుచూసినా వైద్యం అందకపోవడంతో సత్యవాణి బందువులు ఆందోళన చెందారు. డాక్టర్ల తీరును నిరసించారు. ఈలోగా పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు గత్యంతరం లేక... గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మహిళను తరలించారు. జీజీహెచ్ లో మధ్యాహ్నం తర్వాత వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. తాజా ఉదంతం అందుకు ఉదాహరణగా నిలిచింది...Vis...Body:EndConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.