కృష్ణానదికి వరద తగ్గటంతో గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. 14 రీచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చి 13 నిల్వ కేంద్రాల ద్వారా వినియోగదారులకు ఇసుకను సరఫరా చేస్తున్నారు అధికారులు. శనివారం దుర్గిలో నిల్వ యార్డు ప్రారంభించారు. త్వరలో పిడుగురాళ్ల, వినుకొండలోనూ ఏర్పాటు చేస్తారు.
ప్రజల అవసరం మేర ఇసుక అందుబాటులోకి తెచ్చామని అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. డిమాండ్ మేర నిల్వ లేక సకాలంలో వాహనాలు కదలడం లేదు. వినియోగదారులకు తిప్పలు తప్పట్లేదు. జిల్లాలో రోజుకు 20 వేల టన్నుల ఇసుక అవసరం ఉంది. అందుకే పెదకాకానిలోని నిల్వ కేంద్రం వద్ద వందల వాహనాలు బారులుతీరాయి.
జిల్లావ్యాప్తంగా నిల్వ కేంద్రాలు
డిమాండ్‌కు తగ్గట్టుగా ఇసుక సరఫరాకు యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. మరికొన్ని నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానికంగా అందించాలని నిర్ణయించింది. ఈ నెల 20 వరకు కొనసాగనున్న వారోత్సవాల్లో రోజూ రెండు కొత్త నిల్వ కేంద్రాలు ప్రారంభిస్తోంది. వారోత్సవాల ముగింపు నాటికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వెంటనే సరఫరా చేసేలా కసరత్తు చేస్తోంది. మరో 5 రీచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చి లభ్యత పెంచుతామనంటున్నారు అధికారులు. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి అందరికీ ఇసుక అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి: