ETV Bharat / state

'అప్పుడు ఒప్పుకొని.. ఇప్పుడు తప్పిస్తున్నారు' - అమరావతిపై ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పందన

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అనుకూలమని చెప్పి... ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు పెడతామంటూ సీఎం జగన్ మాట్లాడుతున్నారని.. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

rally for amaravathi at ponnur in guntur district
పొన్నూరులో ర్యాలీ
author img

By

Published : Dec 26, 2019, 3:19 PM IST

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చటం హేయమైన చర్య అని మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో 'మూడు రాజధానులు వద్దు- ఒక రాజధాని ముద్దు' అనే నినాదంతో గుంటూరు జిల్లా పొన్నూరులో ర్యాలీ నిర్వహించారు. రాజధాని మార్పు ప్రతిపాదన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతికి అనుకూలమే అని చెప్పి... నేడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని విమర్శించారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఇవీ చదవండి..

ముఖ్యమంత్రి మనసు మారాలని ప్రార్థిస్తున్నాం'

Intro:Ap_gnt_26_51_rajadhani_taralimpuku_nirasanaga_tdp_nirasana_realyAP10117
అమరావతి నుంచి రాజధాని విశాఖకు మార్చటం హేయమైన చర్య అని రాజధాని మార్పు ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం మేరకు మళ్లీ గెలవాలని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు రాష్ట్రంలో మూడు రాజధానులు వద్దు ఒకటే రాజధాని ఉండాలి అంటూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఐలాండ్ సెంటర్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మాట్లాడుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి అనుకూలంగా ఉన్నామని వ్యాఖ్యానించి నేడు ముఖ్యమంత్రి అయినా అనంతరం రాజధానిని మారుస్తామని అంటున్నారు అని అన్నారు రాజధాని అనేది కేవలం 29 గ్రామాల సంబంధించిన సమస్య కాదని ఈ ప్రాంత ప్రజలందరికీ చెందిన సమస్య అని అన్నారు ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా రాజధాని మారిస్తే ఏమవుతుంది అని మాట్లాడటం దారుణమన్నారు అమరావతి పై జరిగే క్యాబినెట్ మీటింగ్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు

Body:ఐలాండ్ సెంటర్ నుంచి నిరసన కార్యక్రమం ప్రారంభం కాగానే పట్టణంలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని దీనితోపాటుగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేసేందుకు అనుమతి లేదంటూ పట్టణ సీఐ ప్రేమ నాయకులతో వాగ్వివాదానికి దిగారు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని కానీ 144 సెక్షన్ అమలులో ఉంది కానీ మీరు ఎక్కడ ప్రచారం చేయలేదని ఇప్పుడు ప్రకటించలేదని శాంతియుతంగా చేసుకుంటున్నా నిరసన కార్యక్రమానికి అడ్డు రావద్దు అంటూ సిఐ ప్రేమతో వాదించారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.