గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య జఠిలం కావటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు తోపుడు బండ్లు, టిఫిన్ వాహనాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన హరిహరమహల్, కోరిటిపాడు సెంటర్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, అమరావతి రోడ్డులోని ఆక్రమణలను తొలగించారు. ఎవరైనా ప్రయాణికులకు, రవాణాకు ఆటంకం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ వాసు హెచ్చరించారు.
ఇదీ చూడండి: గుంటూరులో భారీ వర్షం...వాహనదారుల ఇబ్బందులు