ETV Bharat / state

'నూతన బార్ల విధానాన్ని రద్దుచేయండి' - ఏపీలో కొత్త బార్ల విదానం

కొత్త బార్ల విధానాన్ని ప్రకటిస్తూ నవంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం జీవో 473ని విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు నేడు విచారణ చేపట్టే అవకాశముంది.

new bar policy in ap
ప్రతీకాత్మక చిత్రం
author img

By

Published : Dec 2, 2019, 11:30 PM IST

Updated : Dec 3, 2019, 5:11 AM IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ల విధానాన్ని సవాలు చేస్తూ వివిధ జిల్లాలకు చెందిన బార్​, రెస్టారెంట్ యజమానులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. బార్ల పాలసీకి సంబంధించిన జీవో 473 చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. బార్ల లైసెన్లను ఈ ఏడాది చివరితో ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ల విధానాన్ని ప్రకటిస్తూ నవంబర్ 22న జీవో 473ని జారీచేసింది. దీని ప్రకారం ఇప్పుడున్న వాటిలో 40శాతం బార్లు తగ్గనున్నాయి. రెండేళ్ల కాల పరిమితితో కొత్తవి ఏర్పాటు కానున్నాయి. దీనికి తగ్గట్టు ఎక్సైజ్ నిబంధనలను రూపొందిస్తూ 25 నవంబర్ జీవో 478ని జారీ చేసింది ప్రభుత్వం. వాటిని సవాలు చేస్తూ రాష్ట్రంలోని వివిధ బార్లకు చెందిన యజమానులు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టు ఈ వ్యాజ్యాలపై నేడు విచారణ జరపనుంది.

బార్లను నిర్వహించుకునే హక్కు మాకుంది

'2022 జూన్ 30 వరకు మాకు బార్ల నిర్వహణకు 2017లో లైసెన్స్ మంజూరు చేశారు. లైసెన్స్ రుసుము చెల్లించాం. సహేతుకమైన కారణం లేకుండా రాష్ట్ర ప్రభుతం ఏడాది మద్యలో నూతన బార్ల విధానాన్ని ప్రకటించింది. ఏపీ ఎక్సైజ్ చట్టం, సెక్షన్ 72 ఆధారంగా జారీచేసిన నిబంధనలు రాష్ట్రంలో విడతల వారీగా మద్యం నిషేధం విధించేందు సంబంధించినవి కావు. రాష్ట్రంలో మద్యం వినియోగంపై నిషేధానికి బార్లు, రెస్టారెంట్లకు మంజూరు చేసిన లైసెన్సులకు సంబంధం లేదు. బార్ల సంఖ్యను కుదించినంత మాత్రాన మద్యం వినియోగదారుల సంఖ్య తగ్గదు. బార్లకు లైసెన్స్ పొందినప్పుడు వాటిని నిర్వహించుకోవడానికి మాకు హక్కు ఉంది. తాజాగా లైసెన్సులు మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నవంబర్ 29న ప్రభుత్వం ప్రకటన జారీచేసింది . కొత్తగా లైసెన్సులు మంజూరు చేస్తే మేము నష్టం ఎదుర్కొవాల్సి వస్తుంది . ఆ ప్రక్రియను నిలువరించండి. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని మాకు సంబంధించిన బార్ల లైసెన్సులను ఉపసంహరించకుండా ఆదేశించండి. నూతన బార్ల విధానాన్ని రద్దుచేయండి ' అని వ్యాజ్యంలో కోరారు .

sample description
Last Updated : Dec 3, 2019, 5:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.