ETV Bharat / state

'సీమలోనే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువ' - pawan kalyan tweets on jagan news

రాయలసీమలోనే మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఎస్సీలపై దాడులు జరిగినా బయటకు చెప్పేందుకు భయపడుతున్నారని ట్వీట్‌ చేశారు. 1996లో విడుదలైన 'కడప జిల్లాలో పాలెగాళ్లు' పుస్తకాన్ని ప్రస్తావించిన పవన్‌... పుస్తకంలోని 75వ పేజీలో సీఎం జగన్‌ ప్రస్తావన ఉందన్నారు.

pawan-kalyan-tweets-on-jagan
author img

By

Published : Nov 25, 2019, 12:56 PM IST

మాతృభాష ప్రాధాన్యం, రాయలసీమ ముఠా సంస్కృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ... మాతృభాషల ప్రాధాన్యంపై చేసిన ప్రసంగానికి సంబంధించి ఈనాడులో ప్రచురితమైన వార్త క్లిప్పింగును పోస్ట్ చేశారు. మోదీ మాటలపై జగన్‌, వైకాపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. 1996లో ప్రచురితమైన 'కడప జిల్లాలో పాలెగాళ్లు' అనే పుస్తకాన్ని ట్వీట్‌లో ప్రస్తావించారు. రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా... వెనుకబడిన వర్గాల జీవితాలు మారలేదన్నారు. ఈ పుస్తకంలో 75వ పేజీలో సీఎం జగన్‌ ప్రస్తావన ఉందని పవన్‌ అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన రాయలసీమలోనే అధికంగా ఉందని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల మీద దాడులు జరిగితే... బయటకు చెప్పేందుకు భయపడుతున్నారని... రెసిడెన్షియల్ స్కూల్‌ విద్యార్థిని సుగాలి ప్రీతి ఉదంతమే దీనికి ఉదాహరణ అని పవన్‌ అన్నారు. అక్కడి యువత బాధలు గుండెను కలచివేశాయన్నారు.

  • మన నుడి ,మన నది
    ————————
    మన దేశ ప్రధాని ,శ్రీ నరేంద్ర మోదీ గారు,అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం సందర్భాన ,మనకి బాత్ కార్యక్రమం లో ప్రస్తావించింది విని, శ్రీ జగన్ రెడ్డి గారు, మిగతా వైసీపీ సమూహం,ఎలా స్పందిస్తారో విందామని వేచిచూస్తున్నాను... pic.twitter.com/d8p7t6TgAp

    — Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
'సీమలోనే మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువ'

ఇవీ చదవండి..

రాష్ట్రంలో ఇసుక 'వార్' ఉత్సవాలు: లోకేశ్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.