ETV Bharat / state

'ఆంగ్లం రాకపోయినా... బొత్స సంపాదన ఆగలేదుగా..!'

author img

By

Published : Nov 14, 2019, 2:54 PM IST

తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని ఆవేశంతో అనలేదని పవన్​ కల్యాణ్​ స్ఫష్టం చేశారు. భాషల్ని గౌరవించే సంప్రదాయం జనసేన పార్టీదన్నారు.

తెలుగు భాషపై పవన్​ కల్యాణ్​
ఆంగ్లమాధ్యమంపై జనసేనాని తీవ్ర విమర్శలు

తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని తాను ఉద్దేశపూర్వకంగానే అన్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ బాధపడిపోతున్నారని... ముందు సీఎం జగన్​కు ఎలా మాట్లాడాలో చెప్పండని సూచించారు. విడిపోయిన వారి జీవితాలపై మాట్లాడటం తగదని వారించారు.

సంపాదన ఆగలేదుగా..!

భాషల్ని గౌరవించే సంప్రదాయం జనసేన పార్టీదని పవన్​ స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణకు ఆంగ్లం రాకపోయినా సంపాదన ఆగలేదని ఎద్దేవా చేశారు. తెలుగు మాధ్యమంలో చదివే ఒక్క విద్యార్థి ఉన్నా.. ఆ పాఠశాలలో మాతృభాషలోనే బోధించాలని జనసేనాని డిమాండ్ చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై వైకాపా నేతలకు ఏమాత్రం గౌరవం లేదని ఆయన విమర్శించారు. తెలుగులో ఉన్న లక్షల పుస్తకాల జ్ఞానం విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

'సీఎంను ఎలా పిలవాలో వైకాపా ఎమ్మెల్యేలు తీర్మానించండి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.