గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వీర బ్రహ్మం తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్న బ్రహ్మం...చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. గుంటూరులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాతో సంబంధం పెట్టుకున్నాడు. దీని ద్వారా అధిక మొత్తంలో నగదు వస్తోందనే ఆశతో... తానే స్వయంగా ఓ వెబ్సైట్ తయారు చేశాడు. తనతో పాటు మరొక యువకుడిని భాగస్వామిగా చేసుకున్నాడు. ఈ వెబ్సైట్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టాడు. వెబ్సైట్లో ఫోన్ నంబర్లు పెట్టి కాల్ చేసిన వారికి యువతిలతో పరిచయాలు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహించేవారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
వీరబ్రహ్మం ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి వ్యభిచారం కూపిలోకి దించాడు. కొరిటీపాడులో కొన్ని రోజులు, పాత గుంటూరు- నందివెలుగు రోడ్డులో మరికొన్ని రోజులు వ్యభిచారానికి తెరలేపాడు. నిందితులు వీర బ్రహ్మం, ఉప్పల థామస్‌తో సహా ఇద్దరు విటులు భూపతి నాగేశ్వరరావు, అశోక్ కుమార్, యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గుంటూరు తూర్పు డీఎస్పీ కె.సుప్రజ తెలిపారు.
దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించాల్సిన యువత...నేడు చెడు వ్యసనాలకి బానిసలై తమ ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: మెడికోలను వేధిస్తున్న సైకో డాక్టర్‌కు సంకెళ్లు..!