ETV Bharat / state

'చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం' - బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

ప్రజల్ని మోసం చేసేందుకే వైకాపా ప్రభుత్వం కమిటీలను వేస్తోందని... తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స మండిపడ్డారు. చంద్రబాబు చేసేవన్నీ అవినీతి పనులు... చెప్పేవన్నీ నీతులు అని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతున్నారని వ్యాఖ్యానించారు.

bosta satyanarayana
బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jan 4, 2020, 9:01 PM IST

Updated : Jan 4, 2020, 10:25 PM IST

మీడియా సమావేశంలో మంత్రి బొత్స

అమరావతిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని... మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన..... శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు చదవాలని సూచించారు. పాలనా వికేంద్రీకరణ ఉండాలని శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక చెప్పిందని వివరించారు. పంటలున్న చోట భవనాలు వద్దని ఆ కమిటీ నివేదిక చెప్పిన విషయం గుర్తుచేశారు. నాట్ ఫీజబుల్‌ అనే మాట వాడిందా లేదా... చంద్రబాబు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

3వేల కోట్లు ఎలా సరిపోతాయి..?
అమరావతిలో ఖర్చు పెట్టిన నిధులపై చంద్రబాబు చెప్పేవి అసత్యాలని మంత్రి బొత్స ఆరోపించారు. 'అమరావతిలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అన్నారు. మరో 3 వేల కోట్లు ఖర్చు చేస్తే రాజధాని పూర్తవుతుందని అన్నారు. మరి రూ.52 వేల కోట్లకు టెండర్లు ఎందుకు పిలిచారు..? అని ప్రశ్నించారు. అమరావతి రోడ్ల కోసం రూ.19,769 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇన్నిచేసి కేవలం 3 వేల కోట్లు సరిపోతాయని చంద్రబాబు ఎలా చెబుతారని నిలదీశారు. వందల ఏళ్ల సిటీ కనుకే హైటెక్ సిటీతో హైదరాబాద్‌ ఎలివేట్ అయ్యింది. అమరావతిలో ఒక టౌన్‌షిప్ కట్టి రాజధాని అభివృద్ధి అంటే ఎలా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ.1.96 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆయన చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతున్నారని బొత్స పేర్కొన్నారు.

వాళ్లకు చేస్తే మంచివాళ్లా..?
ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్న సంస్థ.. బీసీజీ. బీసీజీది పనికిమాలిన నివేదికని చంద్రబాబు అన్నారు. చాలా దేశాల్లో చంద్రబాబు నిర్వహించిన వ్యవహారాలకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ బీసీజీనే. ఇప్పడు ఆయనే దాన్ని తప్పు పడుతున్నారు. వాళ్లకు చేస్తే మంచివాళ్లు.. ఇతరులకు చేస్తే అవినీతిపరులా..?. నితిఆయోగ్‌కు కూడా బీసీజీ సలహాలు, సూచనలు ఇచ్చింది. చంద్రబాబు చేసేవన్నీ అవినీతి పనులు.. చెప్పేవన్నీ నీతులు.
-బొత్స సత్యనారాయణ

అది కాని పని...
అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం. అన్నిప్రాంతాలూ అభివృద్ధి చేస్తారనే వైకాపాకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ముందుకు వెళ్తున్నాం. మూడు లక్షల కోట్ల రూపాయలతో అమరావతి టౌన్ షిప్ పూర్తి చేయడం కాని పని. పోలవరం పూర్తి చేసేందుకు, సీమ అభివృద్ధికి ఇంక నిధులు కేటాయించుకోవద్దా..? చంద్రబాబు స్వార్థంతోనే భోగాపురం ఎయిర్​పోర్టు ఆగిపోయింది. విశాఖ మెట్రో, ఎయిర్​పోర్టు నిర్మాణంలో మాకేం ఇస్తారు అని ఆలోచించారు కాబట్టే పనులన్నీ ఆలస్యమయ్యాయి. మక్కికిమక్కి అవే మ్యాప్​లను రివర్స్ టెండరింగ్​లో తగ్గించాం.
-బొత్స సత్యనారాయణ

దుష్ప్రచారం చేస్తున్నారు...
పవన్ కల్యాణ్ మధ్యలో వచ్చి ఎవరు జగన్ అంటారు. సీఎం వాహనశ్రేణి వెళ్తుంటే కొందరిని ఆపుతారని తెలియదా..? పవన్‌ను పోలీసులు ఆపేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెళ్తుంటే నన్ను కూడా కాసేపు ఆపుతారు. ఇసుక సమస్య వచ్చింది... మేము రాష్ట్ర ప్రజలకు చెప్పుకున్నాం. ప్రతిపక్షాలు నానా హడావిడి చేసినా... ఒక వైకాపా మంత్రి, ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయా...? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ ఆలోచన. చంద్రబాబులా చరిత్ర హీనుడిలా కాకుండా... చరిత్రకారుడిలా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచన'.
-బొత్స సత్యనారాయణ

ఇదీ చదవండి:'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'

Intro:Body:Conclusion:
Last Updated : Jan 4, 2020, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.