ETV Bharat / state

మధ్యాహ్న భోజన కార్మికురాలి ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా పానకాలపాలెం ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం వంట మనిషి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానిక వైకాపా నేతల వేధింపులు తాళలేకే ఈ ఘటనకు పాల్పిడినట్లు బాధితురాలి బంధువులు ఆరోపించారు.

'వేధింపులు తాళలేక... మధ్యాహ్న భోజనం వంట మనిషి ఆత్మహత్యాయత్నం'
author img

By

Published : Nov 5, 2019, 11:34 AM IST

మధ్యాహ్న భోజనం వంట మనిషి ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా పానకాల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్న మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. 3 సంవత్సరాలుగా చిప్పగిరి గురమ్మ అనే మహిళ మధ్యాహ్న భోజన పథకం వంటమనిషిగా పనిచేస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక నేతలు ఆమెను విధుల నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. లేని పక్షంలో 6నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాన్ని నిలుపుదల చేయిస్తామంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. మనస్థాపం చెందిన మహిళ... సోమవారం ఉదయం పాఠశాల ఆవరణలో పురుగుల మందు తాగినట్లు తెలిపారు. అనంతరం ఆమెను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలు గురమ్మది... చాలా పేద కుటుంబం అని ఇలాంటి అభాగ్యులను వేధింపులకు గురి చేయటం వైకాపా నాయకులకు ఎంత వరకు సబబని గ్రామస్థులు ప్రశ్నించారు.

ఇవీ చూడండి

పింఛనే ఆధారం.... రేషన్​ బియ్యంతోనే భోజనం!

Intro:AP_GNT_86_04_MIDDEA_MEELS_KUCK_AATHMAHATA_YETHNAM_AVB_AP10038
contributor (etv)k.koteswararao, vinukonda
ప్రభుత్వం మారింది పని చేయడానికి వీలులేదు అని నాలుగు నెలలు గా గుంటూరు జిల్లా వినుకొండ మండలం పానకాల పాలెం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాల లో గత 3 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకం కుక్కు గా పనిచేస్తున్న చిప్పగిరి గురమ్మ అనే ఉద్యోగిని గ్రామస్థాయి వైసీపీ నేతలు వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపం చెందిన ఆ యువతి పాఠశాల ఆవరణలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది తక్షణమే బంధువులు వినుకొండ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆ యువతి మరణిస్తే ముగ్గురు చిన్న పిల్లలు ఉన్న ఆ పేద కుటుంబం కుటుంబం పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్న బంధువులు

Body:గుంటూరు జిల్లా వినుకొండ మండలం పానకాల పాలెం గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల లో 3 సంవత్సరాల గా చిప్పగిరి గురమ్మ అనే మహిళ మధ్యాహ్న భోజన పథకం కుక్కు గా పనిచేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పానకాల పాలెం గ్రామస్థాయి వైసిపి నాయకులు ఆమెను విధుల నుండి తప్పుకోవాలని లేనిపక్షంలో ఆరు నెలలుగా రానటువంటి జీతభత్యాలను నిలుపు చేయిస్తామని పలు విధాలుగా వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఈరోజు ఉదయం పాఠశాల ఆవరణలో తన వెంట పురుగు మందు డబ్బా తెచ్చుకొని తాగింది నిర్ఘాంత పోయిన పాఠశాల ఉపాధ్యాయులు బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆమె భర్త వినుకొండ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించాడు
ఐదు నెలలుగా గ్రామంలోని వైసీపీ నేతలు బెదిరింపు చర్యలు పాల్పడడంతో మనస్థాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించిందని భర్త ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు
బాధితురాలికి మూడు సంవత్సరాల అమ్మాయి 7, 5 సంవత్సరాలు కలిగిన అబ్బాయిలు ఉన్నారని వారిది చాలా పేద కుటుంబం అని ఇలాంటి అభాగ్యులను వేధించడం వైసీపీ నాయకులకు ఎంత వరకు సబబని గ్రామస్తులు అంటున్నారు

Conclusion:బైట్స్ 1.చిప్పగిరి నాగేశ్వరరావు (బాధితురాలి భర్త)
2. నాసరమ్మ (బాధితురాలి అత్త)
3. రమణ (బాధితురాలి అక్క)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.