గంగిగోవు లాంటి రైతులను ప్రభుత్వమే కన్నీరు పెట్టించడం సమంజసం కాదని సినీ నటుడు శివకృష్ణ అన్నారు. తుళ్లూరు దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన.. రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతిలో భారీ స్థాయిలో అన్నీ సిద్ధమైన తర్వాత తరలిపోవాలనే ఆలోచన ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. ఏ పార్టీ తరపున కాకుండా కేవలం రైతుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొనే తాను వచ్చినట్లు స్పష్టం చేశారు.
ఇదీచదవండి