ETV Bharat / state

ప్రభుత్వం మా ఇసుక తీసుకెళుతోంది..! హైకోర్టుకు  "ఎల్&​టీ" - high court suspends government orders on l and t sand project

గుంటూరు జిల్లాలో తమ ప్రాజెక్ట్​ సైట్​ నుంచి ప్రభుత్వం ఇసుక తరలించడంపై అభ్యంతరం తెలుపుతూ ఎల్​అండ్​టీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ధర్మాసనం సర్కారు ఆదేశాలను నాలుగు వారాల పాటు సస్పెండ్​ చేసింది.

'ఎల్​అండ్​టీ సంస్థ ఇసుకపై పూర్వ స్థితినే కొనసాగించండి'
author img

By

Published : Oct 25, 2019, 10:22 PM IST

Updated : Oct 26, 2019, 12:53 AM IST

గుంటూరు జిల్లా తాళ్లాయ పాలెం మండలం మందడంలోని తమ ప్రాజెక్ట్​ సైట్​ నుంచి ప్రభుత్వం ఇసుక తరలించడంపై అభ్యంతరం తెలుపుతూ... ఎల్​అండ్​టీ సంస్థ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిని విచారించిన ధర్మాసనం... ఇసుకపై పూర్వ స్థితినే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక సర్కారుదే అంటూ జారీ అయిన ఉత్తర్వులను నాలుగు వారాల పాటు సస్పెండ్​ చేసింది. కిందటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎల్అండ్​టీ సంస్థ రాజధానిలో పలు నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం పెండింగ్​లో ఉన్నాయి. నిర్మాణ పనుల కోసం ఎల్​అండ్​టీ సంస్థ పెద్ద మొత్తంలో ఇసుకను తమ ప్రాజెక్టు సైట్లలో నిల్వ ఉంచింది. ఇప్పుడు అక్కడి నుంచే ప్రభుత్వం ఇసుక తరలిస్తోందని ఎల్​అండ్​టీ కోర్టును ఆశ్రయించింది.

ఇదీ చూడండి:

'బంగారు బాతు ఐతే... కోర్టు ఎందుకు నిలదీసింది...?'

sample description
Last Updated : Oct 26, 2019, 12:53 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.