ETV Bharat / state

'భాజపా తలచుకుంటే... అప్పుడే జమిలి ఎన్నికలు' - గల్లా జయదేవ్ జమిలి ఎన్నికలు న్యూస్

2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. దిల్లీలో ఎవరిని అడిగినా... ఇదే విషయం చెబుతున్నారని తెలిపారు.

gunturu mp galla jayadev on elections
author img

By

Published : Oct 24, 2019, 9:27 AM IST

జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు:గల్లా

జమిలి ఎన్నికలకు వెళ్లాలో లేదో... భాజపా నిర్ణయించుకుంటుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఆ సమయానికి భాజపాకు అనుకూలంగా ఉందనుకుంటే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కాకుమానులో తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో ఎన్నికలు నిర్వహిస్తే... మోదీ మరోసారి ప్రధాని అవడానికి అవకాశం ఉంటుందన్నారు. 2024లో జరిగితే అమిత్ షా ప్రధాని అవుతారనే మాట వినిపిస్తోందని గల్లా చెప్పారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దిల్లీలో ఆంధ్రా గురించి అడగాలంటే తెదేపా ఎంపీలనే అడుగుతారని పేర్కొన్నారు.

రాజన్న రాజ్యం కాదు... రద్దుల రాజ్యం
రాజధాని అమరావతి నిర్మాణం రద్దు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని గల్లా జయదేవ్ ఆరోపించారు. రాజన్న రాజ్యం కాదని... రద్దుల రాజ్యమని ఎద్దేవా చేశారు. రూ.10 కోట్లతో ప్రజా వేదిక నిర్మిస్తే... దాన్ని కావాలనే నాశనం చేశారని విమర్శించారు. ప్రభుత్వం తెదేపాపై కక్ష సాధింపు కోసమే కూల్చేశారని గల్లా అన్నారు.

ఇదీ చదవండి:'రాజధాని తరలింపుతో ప్రయోజనమేంటి?'

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 23-10-2019 Slug:AP_Atp_21_23_mepma_bajar_sale_Avb_ap10176 anchor:అనంతపురంజిల్లా,గుంతకల్లులోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మెప్మా (పేదరిక నిర్ములన సంస్థ) అద్వెర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ ఎత్తున వస్తు విక్రయ సేవలు ప్రారంభించారు.పట్టణంలోని ఎస్.హెచ్.జీ సంఘ సభ్యులు స్వయంగా తయారు చేసినటువంటి వస్తువులు అమ్మకానికి ప్రదర్శన శాలలో ఉంచారు.నిత్యావసర వస్తువులు, మానవ జీవితంలో ఉపయోగపడే వస్త్ర,అలంకరణ వస్తువులు,పచ్చళ్ళు,మసాలా దినుసులు మొదలగు వాటిని తక్కువ ధరలో విక్రయించడానికి ప్రధాన కూడళ్లలో స్టాల్ల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పాల్గొని స్టాల్ల్స్ ను పరిశీలించారు. ఆధునిక జీవితంలో సంప్రదాయ పద్ధతులను వదిలి పాచ్యాత సంస్కృతికి అలవాటు పడి వాటికి బానిస అవుతున్నామన్నారు.అలాంటి విధానానికి స్వస్తి పలికి స్వతహాగా తయారు చేసినటువంటి వస్తువులు వాడటం వల్ల ఆరోగ్యానికి మంచి చేకూరుతుందని అన్నారు. బైట్1:-మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గుంతకల్లు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.