పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాల అమలులో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ, నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్లలోని అధికారులు హాజరయ్యారు. అర్హులైన వారికి కేటాయించే గృహాలకు కావాల్సిన ప్రభుత్వ స్థలాల సేకరణపై కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వ భూముల్లేని ప్రాంతాల్లో ప్రైవేట్ పట్టా భూములను సాధ్యమైన తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు. అనుకున్న సమయానికి ఇళ్ల పట్టాలు సిద్ధం చేయాలని సూచించారు.
ఇవీ చూడండి-కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం