గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీ, తహశీల్దార్, ఎంపీడీవో, పంచాయతీరాజ్, అగ్నిమాపక కార్యాలయాల ముందు ప్రభుత్వ వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గతంలో అధికారుల వాహనాలు నడిపేందుకు డ్రైవర్లు ఉండేవారు. కాలక్రమేణా డ్రైవర్ల నియామకం లేకపోవడంతో... పాత వాహనాలు వాడేందుకు అధికారులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా ప్రభుత్వ వాహనాలను పట్టించుకునే వారు లేక... తుప్పుపట్టి మట్టి పాలవుతున్నాయి. లక్షలు వెచ్చించి ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాలు నిరుపయోగంగా మారటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి అలా పడి ఉండే బదులు వాటిని అమ్మి... ఆ డబ్బుతో ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులు, ప్రజల అవసరాలు వంటి వాటికి ఉపయోగించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి-ఆకాశరామన్న లేఖతో హత్యలను ఛేదించిన పోలీసులు