జీవితంలో ఎదగాలంటే కష్టపడాలని... బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలంలోని ఎన్ఆర్ఐ ఐటిఐ కళాశాలలో జరిగిన సాంకేతిక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీమంత్రి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల కరస్పాండెంట్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... సిగ్గు, భయం వదిలిపెడితేనే విద్యార్థులు ముందుకు వెళ్తారన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం గుర్తించి ప్రోత్సహిస్తూ... కళాశాలలో ప్రతి సంవత్సరం సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
ఇవీ చదవండి....22 ఏళ్లకే ఐపీఎస్.. గుజరాత్ యువకుడి ఘనత