గుంటూరులో రాత్రి 11 గంటలు దాటిందంటే ఆహార పదార్థాలు దొరకక అవస్థలు పడుతున్న నగరవాసులకు... కాస్త ఊరట లభించేలా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. రాత్రి ఒంటి గంట దాటినా భోజనం లభించేలా ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేయించారు. గతంలో చిరు వ్యాపారులు చిన్న బండ్లు, స్కూటీలపైన అల్పాహారాన్ని రోడ్డు ప్రక్కన విక్రయించేవారు. దీనివల్ల ట్రాఫిక్‌కు కలుగుతోందని భావించిన ఎస్పీ... వ్యాపారులందరితో చర్చించి ఒకేచోట ఫుడ్ కోర్టులను ప్రారంభించారు. వీటి పని తీరు బాగుంటే మరోచోట ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రెండురోజుల క్రితం హిందూ కళాశాల కూడలి వద్ద ప్రారంభమైన ఫుడ్‌కోర్టులకు స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఇవి కూడా చదవండి: