ETV Bharat / state

ఉద్యోగుల క్వార్టర్స్ భవనాలపైకి ఎక్కి... రాజధాని రైతుల ఆందోళన

author img

By

Published : Jan 19, 2020, 5:29 PM IST

రాజధానిపై ప్రభుత్వ తీరుకు నిరసనగా అమరావతి నేలపాడులోని ఉద్యోగుల క్వార్టర్స్ భవనాల పైకి ఎక్కి రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వ భవనాలు గ్రాఫిక్స్ కాదు.. నిజమైనవే అని చెప్పేందుకే ఈ పని చేసినట్టు తెలిపారు.

Farmers agitating by climbing into employees' quarters in Nelapadu

ఆకాశ హర్మ్యాలపైకి ఎక్కి...రాజధాని రైతుల ఆందోళన

అమరావతి నిర్మాణం.. గ్రాఫిక్స్‌ మాయాజాలం కాదని ఐనవోలుకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో.. నేలపాడులో ఉద్యోగుల క్వార్టర్స్ భవనాలపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. అక్కడి నుంచే జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. వ్యక్తిగత రాజకీయ కక్షలతో తమను అవస్థల పాలు చేయొద్దని కోరారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున అక్కడికి చేరిన వారి కుటుంబ సభ్యులు.... దిగమని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అంతకు ముందు రాయపూడిలోనూ ఎమ్మెల్యే క్వార్టర్స్​పైకి ఎక్కి కొందరు రైతుల ఆందోళన చేశారు.

ఇదీ చదవండి:

రాయపూడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్​పైకి ఎక్కి రైతుల ఆందోళన

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.