రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రతిపాదనను నిరసిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్లే ముఖ్యమంత్రిని సామాన్యులు కలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన, బొత్స ఉత్తరాంధ్రను వెనకబడిన ప్రాంతం అని అంటున్నారన్నారు. గతంలో సుధీర్ఘంగా మంత్రి పదవుల్లో ఉన్నప్పడు ఆ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. వెనకబాటుతనం ప్రాతిపదికన రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయకూడదనీ, శ్రీకాకుళంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ఏర్పాటు చేయాలన్నారు. తాము చేస్తున్న దీక్షకు ఏ పార్టీతో సంబంధం లేదనీ, ఎవరైనా పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అమరావతి కోసం.. భువనేశ్వరి గాజులు విరాళం