మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్నికైన కొమ్మూరి కనకారావు గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీలోని మాదిగ కులస్థులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. జగన్ పాలన చూస్తుంటే మరో 20 ఏళ్ల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశముందని ఎంపీ సురేష్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైకాపా శాసనసభ్యులు మేరుగ నాగార్జున, ఎంపీ సురేష్‌లు పాల్గొని కనకారావును అభినందించారు.
ఇదీ చదవండి: