ETV Bharat / state

గుంటూరులో 'ఈనాడు' ఆటో షో - గుంటూరు ఈనాడు ఆటో షో న్యూస్

వివిధ రకాల వాహనాలను ఒకేచోట అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో... 'ఈనాడు' ఆటో షో గుంటూరులో ప్రారంభమైంది. స్థానిక పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ మైదానంలో రెండ్రోజులపాటు జరగనున్న ఈ ఆటో షోను... కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు.

eenadu auto show event in guntur
author img

By

Published : Nov 23, 2019, 8:07 PM IST

గుంటూరులో 'ఈనాడు' ఆటో షో

అన్ని కంపెనీల వాహనాలను ఒకేచోట చేర్చి వినియోగదారులకు అందించడం శుభపరిణామమని... 'ఈనాడు' ప్రయత్నాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ అభినందించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన 'ఈనాడు' ఆటో షో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వెంటనే రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించడం బాగుందని కలెక్టర్​ అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని పాలనాధికారి తెలిపారు. ఈ లోగా ప్రస్తుతమున్న వాహనాలను త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీటీసీ మీరాప్రసాద్ వాహనదారులకు, వివిధ కంపెనీల డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు 'ఈనాడు' యూనిట్ మేనేజర్ పి.రామాంజనేయులు, పలు వాహన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఈనాడు' ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ షో

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.